Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గీతా ఆర్ట్స్ లో బోయపాటి మూవీ లేనట్టేనట!

  • 'వినయ విధేయ రామ' పరాజయం
  • బోయపాటి కెరియర్ పై ప్రభావం
  • బాలయ్యతో త్వరలో సెట్స్ పైకి    
బోయపాటి 'సరైనోడు' చేసిన సమయంలోనే చిరంజీవి దృష్టిలోపడ్డాడు. ఈ సినిమా సమయంలో బోయపాటి ప్రతిభాపాటవాలను చిరంజీవి ప్రశంసించారు. బోయపాటితో సినిమా చేయాలని ఉందంటూ ఉత్సాహాన్ని చూపారు. దాంతో చిరంజీవి కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో తన బ్యానర్లో ఓ సినిమా చేయాలని అల్లు అరవింద్ భావించారు.

చిరంజీవి కమిటైన సినిమాలు పూర్తికాగానే, గీతా ఆర్ట్స్ లో చిరూ - బోయపాటి కాంబినేషన్లో సినిమా చేసే ఉద్దేశంతో ఆయన నిన్నమెన్నటివరకూ వున్నారు. అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వినయ విధేయ రామ' మెగా అభిమానులను నిరాశ పరిచింది. బయ్యర్లకు భారీగా నష్టాలను మిగిల్చింది. దాంతో బోయపాటితో సినిమా చేసే ఆలోచనను అల్లు అరవింద్ విరమించుకున్నారనే వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఇక బోయపాటి మాత్రం బాలయ్యతో సెట్స్ పైకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
boayapati
allu aravind

More Telugu News